భారతదేశం, ఏప్రిల్ 26 -- 'పిడుగు పడి ఏడుగురు మృతి', 'పిడుగుపాటుకు ఆరుగురు బలి' అని నిత్యం వార్తలు వింటూనే ఉంటాము. మరీ ముఖ్యంగా వర్షా కాలంలో పిడుగు అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడుతుందో అంచనా వేయడం ఆ నిమిషంలో కష్టం కాబట్టి, పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ సమస్యకు జపాన్​ శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనుగొన్నారు! పిడుగును కంట్రోల్​ చేసే విధంగా ఒక టెక్నాలజీని రూపొందించారు. ఈ టెక్నాలజీ ద్వారా మెరుపును కంట్రోల్​ చేసి, దాన్ని సురక్షిత ప్రాంతంలో పడే విధంగా దారి మళ్లిస్తారు. పిడుగుపాటు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకే ఈ టెక్నాలజీని తీసుకొచ్చినట్టు జపాన్​ చెబుతోంది. అసలేంటి ఈ టెక్నాలజీ?

జపాన్​ రూపొందించిన ఈ టెక్నాలజీ.. ప్రపంచంలోనే తొలి వాతావరణ కంట్రోల్​ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. మెరుపులను ఇది పూర్తిస్థాయిలో కంట్రోల్​ చ...