భారతదేశం, జూన్ 27 -- శుక్రవారం ప్రారంభంకానున్న జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో ఒడిశా పూరీలోని ఆలయం వద్దకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఈ రథయాత్రను ఛారియట్ ఫెస్టివల్ అని, పవిత్రమైన శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తుంటారు. ఒడిశాలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక ప్రధాన హిందూ పండుగల్లో ఇదీ చాలా ప్రముఖమైనది.

చంద్రమాసంలోని శుక్ల పక్షం రెండవ రోజు (ద్వితీయ తిథి) నాడు ఈ పండుగను జరుపుకుంటారు. చంద్రుడు ప్రకాశవంతంగా మారే ఈ సమయం ఆధ్యాత్మికంగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

జగన్నాథ సంస్కృతిపై ప్రఖ్యాత పండితుడు సూర్యనారాయణ్ రథ శర్మ రథయాత్ర గురించి మాట్లాడుతూ.. " ఈ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రథోత్సవం. ఈ యాత్రలో జగన్నాథుడి దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అందరు విశ్వసిస్తుంటారు," అని తెలిపారు.

ప్రతి ఏడాదిలానే.. ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ ప...