భారతదేశం, జూలై 13 -- విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్‌లను తమ వాహనంలోని నిర్దేశిత ప్రదేశంలో అతికించని జతీయ రహదారుల వినియోగదారులపై కఠిన చర్యలు చేపట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది! వాహనానికి అతికించకుండా చేతిలో పట్టుకొని చూపించే లూస్ ఫాస్టాగ్స్ ('ట్యాగ్-ఇన్-హ్యాండ్') ను తక్షణమే రిపోర్ట్​ చేసి, బ్లాక్‌లిస్ట్ చేసే విధానాన్ని ఎన్​హెచ్​ఏఐ మరింత పటిష్టం చేసింది. టోల్ మోసాలను అరికట్టడానికి, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో ఈ చర్య టోల్ కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తుందని పేర్కొంది. వార్షిక పాస్ విధానం, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వంటి రాబోయే కార్యక్రమాల దృష్ట్యా.. ఫాస్టాగ్ ప్రామాణికత, సిస్టమ్ విశ్వసనీయతను నిర్ధ...