భారతదేశం, ఫిబ్రవరి 3 -- రీసెంట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసి, రికార్డులు బ్రేక్ చేసిన మూవీ ధురంధర్. ఈ హిందీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ మూవీని హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.

ధురంధర్ మూవీకి సీక్వెల్ గా 'ధురంధర్ ది రివేంజ్' రాబోతుంది. మార్చి 19, 2026న ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఇటీవల రిలీజ్ డేట్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సీక్వెల్ నుంచి కొత్త పోస్టర్ తో మేకర్స్ ధురంధర్ 2 మార్చి 19నే రిలీజ్ అవుతుందని కన్ఫామ్ చేశారు.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ కేవలం హిందీలోనే రిలీజైంది. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవ...