భారతదేశం, అక్టోబర్ 3 -- వేగవంతమైన, మరింత సురక్షితమైన చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకువచ్చిన కొత్త సెటిల్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. అక్టోబర్ 4 నుంచి అదే రోజు చెక్కు క్లియరెన్స్‌ను ప్రారంభిస్తున్నట్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ప్రకటించాయి.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. అక్టోబర్ 4 నుంచ డిపాజిట్ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే లేదా అదే రోజున క్లియర్ అవుతాయి. దీనితో వినియోగదారులకు త్వరితగతిన నిధులు అందుబాటులోకి వస్తాయి.

చెక్కులు బౌన్స్ కాకుండా ఉండేందుకు, ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని బ్యాంకులు తమ వినియోగదారులను కోరాయి. అలాగే, చెల్లింపుల్లో ఆలస్యం లేదా తిరస్కరణ జరగకుండా ఉండేందుకు, చెక్కుల్లోని అన్ని వివరాలను ఖచ్చితంగా పూరించాలని సూచించాయి.

భద్రతను పెంచేందుకు వీల...