Hyderabad, ఏప్రిల్ 30 -- టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. మూవీతోపాటు ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలో సాంగ్ మరో లెవెల్. దీంతోపాటు గుండెను మెలిపెట్టే ఓ శాడ్ సాంగ్ చిట్టి గువ్వ కూడా ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది.

కోర్ట్ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిట్టి గువ్వ పాటను పూర్ణాచారి రాశాడు. కాలభైరవ పాడాడు. రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన ఈ కోర్ట్ మూవీలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి నటించారు. ఈ మూవీలోని ప్రేమలో సాంగ్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే ఈ చిట్టి గువ్వ పాట కూడా ఆకట్టుకునేలానే ఉంది.

కోర్ట్ మూవీ ఓ ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. చిన్నారులపై లైంగిక దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించడానికి...