భారతదేశం, ఫిబ్రవరి 6 -- అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ను ఆరోసారి గెలిచింది యంగిండియా. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత యువ సైన్యం ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి.. చరిత్రలో అత్యధికంగా ఆరుసార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఫైనల్లో ఇంగ్లండ్ ను 100 పరుగులతో చిత్తుగా ఓడించింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకే ఆలౌటైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే సెమీస్ హీరో ఆరోన్ జార్జ్ వికెట్ కోల్పోవడం కాస్త నిరాశ కలిగించింది. కానీ క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రీవ్ ఎన్ని ప్లాన్లు వేసినా వైభవ్ జోరు ముందు అవి పని...