Hyderabad, సెప్టెంబర్ 18 -- ఘాటి.. భారీ అంచనాల మధ్య రిలీజైన తెలుగు యాక్షన్ డ్రామా. క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ మూవీ అసలు మెప్పించలేకపోయింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా దసరాకే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబులాంటి వాళ్లు నటించిన మూవీ ఘాటి. ఈ యాక్షన్ డ్రామా మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఊహించినదాని కంటే ముందే డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అక్టోబర్ 2 కన్ఫమ్ అని కూడా పలు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రైమ్ వీడియో...