Hyderabad, అక్టోబర్ 3 -- హిందీ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లి గ్లోబల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. అయితే, ఇటీవల అక్టోబర్ 1న సాయంత్రం ముంబైలో జరిగిన బుల్గారి స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ ఈవెంట్ కోసం అమెరికా నుంచి ఇండియాకు విచ్చేసింది ఈ గ్లోబల్ బ్యూటీ.

అయితే, ఇదే ఈవెంట్‌కు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా హాజరైంది. ఇతర సెలబ్రిటీలతో ప్రియాంక చోప్రా మాట్లాడుతుండగా మృణాల్ ఠాకూర్ గ్లోబల్ స్టార్‌ను చూసింది. ప్రియాంక చోప్రాను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది మృణాల్ ఠాకూర్.

ప్రియాంక చోప్రాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది మృణాల్ ఠాకూర్. అలాగే, ప్రియాంక చోప్రాను హగ్ చేసుకుని ఐ లవ్యూ అని చెప్పింది మృణాల్. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందులో మృణా...