భారతదేశం, జూలై 1 -- జులై 1న ఎల్​పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల కొత్త రేట్లు విడుదలయ్యాయి. ఈ రేట్ల ప్రకారం, 19 కిలోల కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధర తగ్గింది. దేశ రాజధాని దిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సిలిండర్ ధర సుమారు రూ. 60వరకు తగ్గింది.

కాగా గృహాల్లో వినియోగించే డొమెస్టిక్​ గ్యాస్ సిలిండర్​ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఈ సిలిండర్​ ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి.

చమురు మార్కెటింగ్​ సంస్థ డేటా ప్రకారం.. దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ఈ రోజు నుంచి రూ .1723.50 కు బదులుగా రూ .1665 కు లభిస్తుంది. అంటే రూ. 58.5 తగ్గింపు! కోల్​కతాలో కమర్షియల్ సిలిండర్ నేటి నుంచి రూ.1769కే లభ్యం కానుంది. గతంలో రూ.1826కు అందుబాటులో ఉండగా, ఇప్పుడు రూ.57 తగ్గింది. ఇక ముంబైలో సిలిండర్ ధర రూ.1616కు చేరింది. జూన్​లో ...