భారతదేశం, డిసెంబర్ 14 -- కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మొబైల్ ఫోన్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ సమీపంలోని మొబైల్ ఫోన్ షాపులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న మరికొన్ని బట్టల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ లేదా మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలుడు వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారి తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.1.2 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని తెలిపారు.

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ...