Hyderabad, సెప్టెంబర్ 22 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 515వ ఎపిసోడ్ లో మనోజ్ గది విషయంలో మరోసారి మీనాను ప్రభావతి దారుణంగా అవమానించడం, ఆమెకు బాలు, సత్యం క్లాస్ పీకడం.. చివర్లో రోహిణికి కొడుకు ఉన్నాడన్న అనుమానం బాలు, మీనాల్లో కలగడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 22) ఎపిసోడ్ అత్త ప్రభావతికి శృతి క్లాస్ పీకే సీన్ తో మొదలైంది. రోహిణి మెడలో పసుపు తాడు చూసి ప్రభావతి బాధ పడుతుంటే.. ఇంట్లో మీనా కూడా ఇలాగే తిరుగుతుందని, ఆమె కూడా ఈ ఇంటి కోడలే కదా అని శృతి నిలదీస్తుంది.

అసలు తనకంటే, రోహిణి కంటే మీనాకే ఈ ఇంటి గురించి ఎక్కువగా తెలుసని అంటుంది. అయినా తన తల్లి మంగళసూత్రం తాకట్టు పెట్టి మరీ డబ్బు అడగలేదు కదా అని చెబుతుంది. శృతి ఎదురు తిరగడంతో ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాక బిక్కమొహం వేస్తు...