భారతదేశం, అక్టోబర్ 28 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 541వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా, బాలు రొమాన్స్ తోపాటు భార్య శృతి కాళ్లు రవి పట్టడం, అటు రోహిణితో రొమాన్స్ ఆఫర్ ను కాదనుకొని షాపులోనే ఉన్న మనోజ్ దారుణంగా మోసపోయి లక్షలు కోల్పోవడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ బాలు, మీనా గది విషయంలో చర్చించుకునే సీన్ తో మొదలవుతుంది. శపథం చేసి వచ్చావు కదా.. మరి గది ఎలా కడదామని మీనాతో బాలు అంటాడు. కొత్త కారు కొని అద్దెకు ఇద్దాం.. దానితో వచ్చిన డబ్బుతో చిట్టీ కడదాం.. ఆ డబ్బుతో గది కట్టుకుందాం అని అంటుంది. కారు కొనడానికి డబ్బు ఎలా అని బాలు అడిగితే.. అత్తయ్యకి ఇచ్చిన బంగారం తాకట్టు పెడదామని మీనా అంటుంది. మొహాన కొట్టిన నగలు ఎలా అడుగుతావని అంటే.. నా కోసం కాదు కదా అని మీ...