Hyderabad, ఆగస్టు 5 -- గుండె నిండా గుడి గంటలు మంగళవారం (ఆగస్ట్ 5) 481వ ఎపిసోడ్ గుడిలో రోహిణి కష్టాల చుట్టూ సాగిపోయింది. ఆమె తండ్రి కోసం ప్రభావతి పూజలు చేయించడం, దీక్ష నియమాలతో రోహిణి అల్లాడిపోవడం, అది చూసి బాలు మరింత ఆడుకోవడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ అంతా సరదాగా సాగిపోయింది. చివర్లో మాజీ లవర్ ను మనోజ్ కనిపెట్టడంతో ముగించారు.

రోహిణి వాళ్ల తండ్రి కోసం అంటూ అందరూ కలిసి గుడికి వచ్చే సీన్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మొదలవుతుంది. ఇప్పుడు మా నాన్న పేరుతో ఈ పూజలు అవసరమా అని మనోజ్ ను అడుగుతుంది రోహిణి. మీ నాన్న క్షేమం కోసమే కదా మా అమ్మ ఇలా చేస్తుందనగానే.. ఆయన కోసం కాదు ఆస్తుల కోసం అని రోహిణి మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు. అక్కడ బాలు కనిపించకపోవడంతో అతడు ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది. అందరూ కలిసి ఆయన...