భారతదేశం, ఫిబ్రవరి 6 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వండిన బిర్యానీ తిని ప్రభావతి అవస్థలు పడుతుంది. మీనాను రోహిణి అంటుంది. మీనా కౌంటర్ వేస్తుంది. మీనా చేసిన బిర్యానీ తన పుట్టింట్లో ఇచ్చి, బయట కొని ఉంటుందని ప్రభావతి అంటుంది.

వాళ్లేమైనా గతి లేనివాళ్లా అని మీనా అంటే.. ఈ పార్లరమ్మలా ఒకరు జైలులో, మరొకరు పైలోకంలో ఉన్నారా. ఊరు గొప్ప పేరు దిబ్బ అని బాలు అంటాడు. కావాలంటే హోటల్ బిల్ చూడమంటుంది ప్రభావతి. ఆ బిల్ చూసిన బాలు డేట్ చూడమంటాడు. డిసెంబర్ 31 నాటి బిల్ అని సత్యం చూసి చెబుతాడు.

నా పుట్టింటిని అనడమేనా అని అత్త ప్రభావతిని అంటుంది మీనా. ఇంతలో సత్యంకు రంగ కాల్ చేసి చెల్లెమ్మకు ఎలా ఉందని అడుగుతాడు. సత్యం చెబుతాడు. అదంతా మా కామాక్షి వల్ల. అదేదో లంబ లంబా అనే వంట ప్రయోగం చేసి పచ్చ కర్పూరంకు బదులు హారతి కర్పూరం వేసిందట. ఇప్ప...