Hyderabad, ఆగస్టు 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 486వ ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి ఆనందం కాసేపట్లోనే ఆవిరయ్యే సీన్ జరిగింది. వాళ్లకు కల్పన డబ్బు తిరిగి ఇచ్చేసినా.. చివర్లో బాలు ఇచ్చిన ట్విస్టుతో ఆ ఇద్దరూ షాక్ తినడం ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ సీన్ తో మొదలైంది. అక్కడ చేసేది లేక కల్పన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తుంది. అయితే రూ.40 లక్షలు కాదు.. రూ.45 లక్షలు ఇవ్వాలని రోహిణి డిమాండ్ చేస్తుంది. ఆ డబ్బు వల్ల తన మామయ్య ఎదుర్కొన్న పరిస్థితులు, కారు అమ్మేయాల్సిన పరిస్థితి గురించి చెప్పి ఎక్కువ డిమాండ్ చేస్తుంది. పోలీసులు కూడా వాళ్లు అడిగేది కరెక్టే అని అనడంతో చేసేది లేక కల్పన అప్పటికప్పుడు రూ.45 లక్షలు ఇచ్చేస్తుంది.

ఇక ఇద్దరి మధ్...