Hyderabad, ఆగస్టు 29 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 499వ ఎపిసోడ్ లో మనోజ్ నిజస్వరూపం బయటపడటంతోపాటు బాలు తల్లి ప్రేమ కట్టిపడేసింది. ఈ ఎపిసోడ్ చాలా వరకు మనోజ్, రోహిణి కొత్త బిజినెస్ మొదలుపెట్టే ప్లాన్ చుట్టే తిరిగింది. మరి ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఆగస్టు 29) ఎపిసోడ్ మనోజ్ ను బాలు ఫర్నీచర్ షాప్‌కు ఒప్పించే సీన్ తో మొదలవుతుంది. తాను మంచి ఫర్నీచర్ షాపు చూశానని బాలు అంటాడు. మనోజ్ మాత్రం తన రేంజ్ కు తగిన షాపు కావాలని బిల్డప్ ఇస్తాడు. ప్రభావతి కూడా అతనికి వంతపాడుతుంది. అది చాలా మంచి షాపు అని, మీ దగ్గర ఉన్న డబ్బుకు వస్తుందనే అనుకుంటున్నట్లు బాలు చెబుతాడు.

దీనికి రోహిణి కూడా బాగానే ఉంది అని అంటుంది. మనోజ్ ఇష్టం లేకపోయినా సరే అంటాడు. అయితే ఈ క్రమంలో బాలును వాళ్లు నిందించడ...