Hyderabad, సెప్టెంబర్ 1 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు అంటే మైల్‌స్టోన్ 500వ ఎపిసోడ్ స్పెషల్ గా సాగింది. బాలు ఎమోషనల్ కావడం, రవి, శృతి రొమాన్స్ కాస్తా వికటించడంలాంటివి జరిగాయి. దీంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయడంతోపాటు నవ్వించేలా కూడా సాగిపోయింది. ఇంకా ఏం జరిగిందో చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 1) ఎపిసోడ్ మనోజ్ ను బాలు బ్లాక్‌మెయిల్ చేసే సీన్ తో మొదలవుతుంది. షాప్‌కి అమ్మ పేరు వద్దన్న మనోజ్ మాటలను బాలు రికార్డు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్లి అమ్మ పేరే పెట్టాలని పట్టుబడతాడు. దీంతో ఏంటీ దౌర్జన్యం అంటూ రోహిణి అంటుంది.

ఇంట్లో ఎవరికీ దక్కని అమ్మ ప్రేమ నీ ఒక్కడికే దక్కిందిరా.. అందుకే నీకు ఆ విలువ తెలియడం లేదు అని బాలు అంటాడు. నువ్వే కదరా అమ్మ పేరు కలిసి రాదన్నావ్ అని మనోజ్ అంట...