Hyderabad, సెప్టెంబర్ 9 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 506వ ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు చుట్టూ తిరిగింది. అత్తింట్లో బాలుకి మళ్లీ అవమానం జరుగుతుంది. ఇటు ఇంట్లోనూ ప్రభావతి, సంజూ కలిసి అతన్ని అవమానిస్తారు. దీంతో బాలు ఏం చేయబోతున్నాడన్న ఆసక్తి నెలకొంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ బాలు.. మీనా వాళ్ల పుట్టింట్లో ఉన్న సీన్ తో మొదలవుతుంది. మీకోసం ప్రత్యేకంగా పాయసం కూడా చేశానని పార్వతి అంటుంది. మీకు షర్ట్ చాలా బాగుంది బావ అని సుమతి అంటుంది. ఎక్కడ కొన్నారని బాలు అడుగుతాడు. తెలియదు.. శివ తీసుకొచ్చాడని నోరు జారుతుంది. దీంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడే శివ కూడా వస్తాడు.

మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నారనుకున్నాను.. ఈ శివ సంపాదించే అక్రమ సొమ్ముతో కొన్నారనుకోలేదని బాలు మండిపడతాడు. శివ కూడా...