Hyderabad, సెప్టెంబర్ 2 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 501వ ఎపిసోడ్ లో బాలుకు మీనా క్లాస్ పీకుతుంది. అటు చివరికి మీనా తల్లి ఇంటికి రావడం, అందరూ కలిసి బాలు, మీనా పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేయడం లాంటి సీన్లు ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ వంట విషయంలో ప్రభావతి చేసే రచ్చతో మొదలవుతుంది. మీనాను పిలిచి మనోజ్, రోహిణిలకు ఇష్టమైన వంటే వండాలని ఆర్డర్ వేస్తుంది. వాళ్లకు నచ్చిన వంటే చేయాలా.. వాళ్ల వంట వాళ్లు చేసుకోలేరా తల్లిని బాలు నిలదీస్తాడు. వాళ్లు బిజినెస్ చేయబోతున్నారని, అంత టైమ్ వాళ్లకు లేదని ఆమె అంటుంది. తనకు వెజ్ బిర్యానీ కావాలని రోహిణి అనగానే ఆర్డర్ పెట్టుకో అని మీనా చెబుతుంది.

ఇంట్లో సొరకాయ తప్ప ఏమీ లేవని, కూరగాయలు లేకుండా బి...