Hyderabad, అక్టోబర్ 2 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 523వ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. ఓవైపు రోహిణి, చింటూ ఎపిసోడ్ నడుస్తుండగానే.. మధ్యలో మీనాని ఫ్రెండ్ ముందే బాలు అవమానించడం, ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోవడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ ఆసక్తి రేపేలా సాగింది. అసలు ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 2) ఎపిసోడ్ సుగుణ, చింటూ హాస్పిటల్ కు వెళ్లే సీన్ తో మొదలవుతుంది. రోహిణి నిజస్వరూపం తెలిసి బాలు ఆమెను వెటకారం చేస్తాడు. ఏం చేయమంటావ్.. అత్తయ్య పోరు పడలేక ఆ మాట అనాల్సి వచ్చిందని రోహిణి అంటుంది.

మళ్లీ ఈ ఇంటికి పిలవకు బాలు.. తమ వల్ల అందరూ బాధ పడాల్సి వచ్చిందని చెప్పి సుగుణ వెళ్లబోతోంది. బాలు చింటూని ఎత్తుకుంటాడు. ఇంతలో అతడు అమ్మా అని పిలుస్తాడు. దీంతో అందరూ షాక్ తింటారు. అతడు అమ్మా అనలేదని, నొప్పిగా ఉన్నప్పు...