భారతదేశం, ఫిబ్రవరి 5 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వంటలను శ్రుతి పొగుడుతుంది. వాళ్లు మాట్లాడుకోవటం చూసి రా ప్రభా తిందాం అని సత్యం కావాలనే అంటాడు. దాంతో శ్రుతి, మీనా గొడవ పడతారు. దాంతో సత్యం నవ్వుతాడు. ప్రభ పేరు చెప్పగానే భలే గొడవ పడుతున్నారే అని సత్యం అంటే.. మీరు కూడా ప్రాంక్ చేశారా మావయ్య అని శ్రుతి అంటుంది.

నా భార్యను మోసం చేస్తున్నారు. నేను ఆ మాత్రం ఆట పట్టించకూడదా అని సత్యం అంటాడు. అంకుల్ కూడా ఆంటీ పార్టీనే అని శ్రుతి అంటుంది. మీరు ఆడుతుంది నాటకం అని తెలిస్తే ప్రభ రంకెలేస్తుంది జాగ్రత్త అని సత్యం అంటాడు. ప్రభావతికి లంచ్ క్యారేజ్ తీసుకెళ్తుంది మీనా.

మీనాను ఎందుకు ఆంటీ ఆడిపోసుకుంటుంది అని శ్రుతి అడిగితే.. మీనాను ఇంటికి తీసుకురావడం మీ ఆంటీకి ఇష్టంలేదు. అందుకే ఇలా చేస్తుందని సత్యం అంటాడు. మరోవైపు మనోజ్‌ను ఒక ...