భారతదేశం, జనవరి 31 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ప్రభావతి పెట్టిన చిచ్చుతో మీనా, శ్రుతి ఇద్దరు గొడవ పడినట్లు నానా మాటలు అనుకుంటారు. మీనాను శ్రుతి పొగరుబోతని, బాలు కంటే గయ్యాలి అని తిడుతుంది. ఇకనుంచి కాఫీ, టీ కావాలన్నా, భోజనం కావాలన్నా అత్తయ్యనే ఇస్తుందని మీనా వెళ్లిపోతుంది.

శ్రుతి కూడా అత్తయ్యే పెడతారని చెప్పి వెళ్లిపోతుంది. వీళ్ల గొడవ నేను వండటం మీదకు వచ్చిందేంటీ. నేను వండి పెట్టాలా. అయితే ఏంటీలే వీరిద్దరు మాత్రం గొడవ పెట్టుకున్నారు. ఇక నుంచి ఈ తోడి కోడళ్లు ఇద్దరు ఉప్పు నిప్పులానే ఉంటారు. ఎప్పటికీ కలవరు, హమ్మయ్యా అని ప్రభావతి తెగ సంతోషిస్తుంది.

రోహిణి ఎక్కడి వెళ్లింది, ఇంత మంచి న్యూస్ చెబుదామంటే రోహిణి లేదేంటీ అని ప్రభావతి అనుకుంటుంది. మరోవైపు సొంతూరికి కల్యాణిగా రోహిణి వెళ్తుంది. అక్కడ చింటు ఏడుస్తూ కన...