భారతదేశం, ఫిబ్రవరి 1 -- నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య.. శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీస్ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జనవరి 23వ తేదీన నిజామాబాద్‌ నగర శివారులో గంజాయి ముఠా హల్‌చల్‌ చేసింది. అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్సైజ్‌ మహిళా కానిస్టేబుల్‌ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వైద్య చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. అయితే ఈ ఘటన అనంతరం పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్...