భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఈ మధ్య కాలంలో పర్సనల్​ లోన్​ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది! అందుకు తగ్గట్టుగానే బ్యాంకులు, ఎన్​బీఎఫ్​లు సైతం ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​ని ఆఫర్​ చేస్తున్నాయి. మరి మీరు కూడా మీ వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సాధారణంగా.. లోన్​ విషయంలో క్రెడిట్​/సిబిల్​ స్కోర్​ ఒక్కటే చూస్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్​ కాదు! మీకు లోన్​ ఇచ్చే ముందు ఆర్థిక సంస్థలు మరికొన్ని అంశాలను సైతం పరిగణిస్తాయి. అవేంటంటే..

క్రెడిట్​ స్కోర్​ అనేది 700-750 కన్నా ఎక్కువ ఉంటే పర్సనల్​ లోన్​లు సులభంగా లభించే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇంత భారీ స్కోర్​ ఉంటే, మీకు తిరిగి చెల్లించే స్తోమత ఉన్నట్టు ఆర్థిక వ్యవస్థలు గ్రహిస్తాయి. అందుకే పర్సనల్​ లోన్​ విషయంలో...