భారతదేశం, జూలై 20 -- మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారా? అయితే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ మీకు సులభమైన మార్గం. మీ కొనుగోళ్లను నెలవారీ వాయిదాలుగా మార్చుకునే సౌలభ్యం, వివిధ రకాల రీపేమెంట్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఇది ఇప్పుడు మరింత సులభంగా మారింది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అంటే.. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన పెద్ద ఖర్చులను మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో నిర్ణీత నెలవారీ వాయిదాలుగా మార్చుకోవడం. సాధారణంగా, ఇది బ్యాంక్ ఈఎంఐ పోర్టల్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్, వ్యాపారి మధ్య కుదిరిన ఒప్పందాల ద్వారా మొదలవుతుంది.

ఈఎంఐ కాలపరిమితులు సాధారణంగా 3, 6, 9, 12, 18, 24 నెలల మధ్య ఉంటాయి. బ్యాంక్ నిబంధనలు, షరతులు, ఆఫర్లను బట్టి వడ్డీ రేట్లు 0% న...