భారతదేశం, సెప్టెంబర్ 2 -- క్రెడిట్ కార్డులను కేవలం ఖర్చుల కోసం కాకుండా, పొదుపు సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా? తెలివిగా వాడుకుంటే, క్రెడిట్ కార్డులు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ఆర్థిక ప్రణాళికలో ఇవి ఒక ముఖ్యమైన భాగంగా మారతాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, క్రెడిట్ కార్డులను పొదుపు కోసం ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు, మీ ఖర్చుల అలవాట్లకు సరిపోయే కార్డును తీసుకోవడం మొదటి మెట్టు. మీ ఖర్చులు కిరాణా సామాగ్రి, ప్రయాణాలు, రెస్టారెంట్లు, రోజువారీ అవసరాలు లేదా యుటిలిటీ బిల్లులకు సంబంధించినవి కావచ్చు. ఈ ఖర్చులకు అనుగుణంగా, ప్రత్యేక కేటగిరీల వారీగా క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లను అందించే కార్డులు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి.

ఉదాహ...