భారతదేశం, మే 11 -- క్రెడిట్​ కార్డులే కాదు పలు యూపీఐ యాప్స్​ కూడా మంచి మంచి రివార్డులు ఇస్తుంటాయి. మీరు గూగుల్​పే, ఫోన్​పే, పేటీఎం లేదా మొబిక్విక్ వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్​ని ఉపయోగిస్తూ.. క్రెడిట్ కార్డు వాడే అలవాటు ఉంటే, ఆ రెండింటిని లింక్ చేయండి. మీకు చాలా బెనిఫిట్స్​ లభిస్తాయి. రూపే క్రెడిట్ కార్డు ద్వారా దీన్ని నిరాటంకంగా చేయవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులను రూపే ఫంక్షనాలిటీకి మ్యాప్ చేశాయి. తద్వారా ఈ కార్డులు యూపీఐ యాప్​ల ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది.

ఈ యూపీఐ యాప్స్ చాలా వరకు వాటి వాడకంపై క్యాష్​బ్యాక్​లు, రివార్డులను అందిస్తున్నాయి. ఈ రివార్డులు వివిధ రకాలు, విభిన్నంగా రీడీమ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

1. గూగుల్​పే: ఇది స్క్రాచ్​కార్డులు, క్యాష్​బ్యాక్​ను ఇస్తుంది. ఇవి వేరియబుల్ రివార్డులన...