భారతదేశం, ఏప్రిల్ 22 -- ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2025 మార్చి 31తో ముగిసిన త్రైమాసికం, ఆర్థిక ఫలితాలతో పాటు డివిడెండ్ ను కూడా ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2/- ఈక్విటీ షేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్ ను డైరెక్టర్ల బోర్డు ప్రకటించిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది.

ఈ మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీని 2025 ఏప్రిల్ 28గా నిర్ణయించారు. ఈ మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీ 2025 మే 6 అని కంపెనీ తెలిపింది. ఇంతకు ముందు హెచ్సీఎల్ టెక్నాలజీస్ రూ.12 మధ్యంతర డివిడెండ్, రూ.6 ప్రత్యేక డివిడెండ్ ను ప్రకటించింది. 2025 జనవరి 17న ఈ డివిడెండ్ చెల్లించింది. ట్రెండ్లైన్ డేటా ప్రకారం, హెచ్సిఎల్...