Telangana, జూలై 6 -- జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్‌లో శనివారం సాయంత్రం తర్వాత దారుణం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటూ 5 ఏళ్ల హితక్ష కనిపించకుండా పోయింది. చుట్టుపక్కన ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాసేపటికే అదే కాలనీలోని ఓ ఇంట్లోని బాత్ రూములో రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక వివరాల ప్రకారం... ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన ఆకుల రాము-నవీన దంపతులకు ఇద్దరు సంతానం. రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లారు. నవీన పిల్లలతోపాటు ఇక్కడే ఉంటున్నారు. వీరి కూతురు హితీక్ష(5) శనివారం సాయంత్రం పాఠశాలకు నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ తర్వాత ఇంటికి రాలేదు.

దీంతో అప్రమత్తమైన తల్లి. చుట్టపక్కల ప్రాంతంలో వెతికింది.సమాచ...