భారతదేశం, జూన్ 21 -- ఫరీదాబాద్ లో ఓ మహిళను ఆమె అత్తమామలు హత్య చేసి తమ ఇంటి ముందు వీధిలోనే పాతిపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ కు చెందిన తనూ కుమార్ అనే మహిళకు ఫరీదాబాద్ లోని రోషన్ నగర్ ప్రాంతానికి చెందిన అరుణ్ సింగ్ తో రెండేళ్ల క్రితం వివాహమైంది. కోడలిని హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తరువాత, వారు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు దాదాపు రెండు నెలల తరువాత వారు చేసిన నేరం బయటపడింది.

ఏప్రిల్ 23న తనూ భర్త అరుణ్ సింగ్, అతని తండ్రి భూప్ సింగ్ కలిసి ఒక జేసీబీని పిలిపించి తమ ఇంటి ముందున్న వీధిలో 10 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. ఆ గొయ్యి డ్రైనేజీ కోసమని ఇరుగుపొరుగు వారికిి చెప్పారు. మరుసటి రోజు, వారు ఆ గొయ్యిని ఒక తాపీ మేస్త్రీని పిలిపించి పూడిపించారు. ఆ తరువాత వారు పోలీసులను ఆశ్రయించి తమ కోడలు తనూ...