భారతదేశం, జనవరి 31 -- హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన దోపిడీ, కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు, నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు.

"ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026 గా కేసు నమోదు చేయబడింది. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 109 (హత్యాయత్నం), 309 (దోపిడీ) ఆయుధ చట్టం-1959 లోని సెక్షన్ 27 కింద అభియోగాలు మోపబడ్డాయి" అని సీపీ సజ్జనార్ తెలిపారు.

"ఫిర్యాదుదారుడు కేరళలోని కోజికోడ్‌కు చెందిన రిన్షాద్ పి.వి. (26) (తండ్రి: అబ్దుల్ అజీజ్), రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ప్రస్తుతం నాంపల్లిలోని జనతా అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున...