భారతదేశం, జూన్ 8 -- కొలంబియాలోని షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగ్యుల్ ఉరిబె టర్బేపై దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. బొగోటాలో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఉరిబెని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

బొగోటా ఫాంటిబోన్ జిల్లాలోని మోడెలియా పరిసరాల్లోని ఎల్ గోల్ఫిటో పార్క్​లో అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు జరిగాయి. మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ సెంటర్ పార్టీ అభ్యర్థి అయిన ఉరిబె మద్దతుదారులను కలుస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పలు ధృవీకరించని వీడియో ప్రకారం.. ఉరిబె ఒక చెట్టు ...