భారతదేశం, ఏప్రిల్ 21 -- జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎంపీవీ ఇండియాలో అడుగుపెట్టబోతోంది. దీని పేరు ఎంజీ ఎం9. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్​ కారు ఈ ఏడాది జూన్​లో లాంచ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఇండియా స్పెక్​ వర్షెన్​ కోసం అందుబాటులో ఉండనున్న కలర్​ ఆప్షన్లను సంస్థ తాజాగా ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ ఎం9 అనేది ఒక 7 సీటర్​ ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఈ ఈవీ మిస్టిక్ గ్రే, ల్యూమినస్ వైట్, కార్డిఫ్ బ్లాక్ అనే మూడు కలర్​ ఆప్షన్స్​లో లభిస్తుంది.

వాస్తవానికి ఈ ఎంపీవీ అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృతమైన కలర్ ప్యాలెట్​లో లభిస్తుంది. ఎంపిక చేసిన కొన్ని షేడ్స్ మాత్రమే భారతదేశానికి వస్తాయి. ఆటో ఎక్స్​పో 2025లో ప్రదర్శన అనంతరం ఈ ఎం9 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇది ఎంజీ హై-ఎండ్ ఎంజీ సెలెక్ట్ షోరూమ్​ల ద్వారా సేల్స్​లోకి వెళుతుంది.

క్లీన...