భారతదేశం, ఆగస్టు 10 -- అక్టోబర్​ 24న కొత్త వెహికిల్​ని ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ సంస్థ ప్రకటించింది. ఇది.. ప్రస్తుతం బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఒకటైన హ్యుందాయ్​ వెన్యూకి నెక్ట్స్​ జనరేషన్​ మోడల్​ అని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మొదటి జనరేషన్ 2019లో విడుదల కాగా, 2022లో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ సైతం బయటకు వచ్చింది. రెండవ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ స్కోడా కుషాక్, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ చూసేయండి..

నెక్ట్స్​ జనరేషన్​ హ్యుందాయ్ వెన్యూకి సంబంధించిన అనేక స్పై షాట్‌లు ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రస్తుత మోడల్‌లోని బాక్సీ సిలౌట్ అలాగే ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఎస్​య...