భారతదేశం, మే 29 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నమోదు, నింపడానికి కొత్త ఆన్లైన్ పోర్టల్ ను ప్రవేశపెట్టింది. అభ్యర్థులకు దరఖాస్తులను ఫిలప్ చేయడం, సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయడం మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్త పోర్టల్ లో పలు ఉపయోగకర ఫీచర్లను యూపీఎస్సీ ప్రవేశపెట్టింది.

యూపీఎస్సీ జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం.. యూపీఎస్సీ కొత్త ఆన్ లైన్ అప్లికేషన్ పోర్టల్లో నాలుగు భాగాలు ఉంటాయి. వాటిని హోమ్ పేజీలో 4 ప్రత్యేక కార్డులలో ఏర్పాటు చేశామరు. వాటిలో మూడు అంటే అకౌంట్ క్రియేషన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫామ్ అన్ని పరీక్షలకు సాధారణమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. వీటిని అభ్యర్థులు ఎప్పుడైనా నింపవచ్చు. నాల్గవ భాగం ఎగ్జామ్. ఇందులో పరీక్ష నోటీసులు, ఎగ్జామినేషన్ అప్లికేషన్, అప్లికేషన్ల స్టేటస్ ఉంటుంది. పరీక్ష ...