భారతదేశం, ఫిబ్రవరి 4 -- మధ్యతరగతి కుటుంబంలో కారు కొనడం అనేది ఒక భావోద్వేగంతో కూడిన నిర్ణయం. షోరూమ్‌కు వెళ్ళినప్పుడు మన ముందు కనిపించే మొదటి ప్రశ్న.. "సార్, పెట్రోల్ కావాలా? డీజిల్ కావాలా?". ఒకప్పుడు డీజిల్ కారు అంటే కేవలం మైలేజీ కోసమే కొనేవారు. కానీ, మారుతున్న నిబంధనలు, ఇంధన ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడం ఇప్పుడు కారు కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తోంది. దానికి తోడు ఇప్పుడు ఆటోమేటిక్ గేర్ బాక్స్ టెక్నాలజీ (AMT, CVT, Torque Converter) ఈ నిర్ణయాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది.

ఒక ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ. 20 నుంచి 25 వరకు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తేడా చాలా రాష్ట్రాల్లో రూ. 5 నుంచి 10 లోపుకు పడిపోయింది. దీనివల్ల డీజిల్ కారు కొని ఇంధన ఖర్చును ఆదా చేయాలనుకునే వారి లెక్కలు మారుతున్నాయి. మరోవైపు బిఎస్-6 (BS6 Phase 2)...