Hyderabad, అక్టోబర్ 2 -- కొణిదెల కుటుంబంలోకి ఈ మధ్యే అడుగుపెట్టిన అబ్బాయికి ఓ పవర్‌ఫుల్ పేరు పెట్టారు వరుణ్ తేజ్, లావణ్య. తన కొడుక్కి వాయువ్ తేజ్ అనే పేరు పెట్టినట్లు వరుణ్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఓ చిన్న వీడియో ద్వారా అతడు వివరించాడు. పేరు యూనిక్‌గా, అదే సమయంలో చాలా శక్తివంతంగా అనిపిస్తోంది.

కొణిదెల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ జోడీకి గత నెలలో కొడుకు పుట్టిన విషయం తెలుసు కదా. అతనికి వాయువ్ తేజ్ అనే పేరు పెట్టినట్లు గురువారం (అక్టోబర్ 2) వరుణ్ ఇన్‌స్టా ద్వారా తెలిపాడు. "మా గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ కు ఇప్పుడో పేరు కూడా వచ్చేసింది" అనే క్యాప్షన్ తో వరుణ్ ఓ చిన్న వీడియో పోస్ట్ చేశాడు.

అందులో హనుమాన్ బ్యాక్‌డ్రాప్ లో టెక్ట్స్ చూడొచ్చు. "అజేయమైన శక్తి, భక్తి, ధైర్యం, ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రతిబిం...