భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ చేస్తోంది. నందినగర్‌లోని ఆయన నివాసానికి పిలిపించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిఘా నివేదికల ప్రకారం.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నందినగర్‌లో, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో పెద్ద సమావేశాలు, నిరసనలు నిర్వహించవచ్చవచ్చు.

ఇంటెలిజెన్స్ చీఫ్... కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెపట్టే అవకాశం ఉందని, తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశారు వెళ్లాయి. కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు అంతటా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితులపై వెంటనే స్పందించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు.

ర్యాలీలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనాలు, దిష్టిబొమ్మల దహనం ఉండ...