భారతదేశం, జూన్ 15 -- ఉత్తరాఖండ్‌లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేదార్‌నాథ్ ధామ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న ఒక హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైందని గుర్తించిన అధికారులకు, అది కుప్పకూలినట్టు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మే 2న కేదార్​నాథ్​ ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి, అంటే ఆరు వారాల్లో ఇది 5వ ఘటన!

కేదార్​నాథ్​ హెలికాప్టర్​ దుర్ఘటన ఆదివారం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో జరిగింది. "గౌరీకుండ్‌లో అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయింది," అని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి. మురుగేశన్ మీడియాకు తెలిపారు.

గర్వాల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ స్వరూప్ మాట్లాడుతూ.. భక్తులను కేదార్‌నాథ్‌కు చేర్చిన తర్వాత గౌరీకుండ్ బయలుదేరిన హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైందని చెప్పా...