భారతదేశం, ఏప్రిల్ 19 -- కెనడాలోని ఒంటారియోలో బుధవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో, ఆ కాల్పులతో ఏ మాత్రం సంబంధం లేని హర్ సిమ్రత్ రాంధవా (21) అనే భారతీయ విద్యార్థిని మృతి చెందింది. హామిల్టన్ లోని ఓ బస్ స్టాప్ లో వేచి ఉన్న సమయంలో ఆమెకు బుల్లెట్ తగిలింది. ఆమె ఒంటారియోలోని మొహాక్ కాలేజీలో విద్యార్థిని.

టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ 21 ఏళ్ల విద్యార్థిని మరణానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఒంటారియోలోని హామిల్టన్ లో భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ రాంధవా దుర్మరణం పట్ల కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రోడ్డుపై జరిగిన కాల్పుల్లో హర్ సిమ్రత్ కు ప్రమాదవశాత్తూ బుల్లెట్ తగిలిందని కెనడా లోని ఇండియన్ కాన్సులేట్ కాన్సులేట్ వెల్లడించింది.

'ప్రస్తుతం హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె కుటుంబాని...