భారతదేశం, ఏప్రిల్ 29 -- కెనడాలో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్​లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

"ఒట్టావాలో భారతదేశానికి చెందిన వంశిక సైని అనే విద్యార్థిని మరణించినట్లు తెలియగానే మేము చాలా బాధపడ్డాము. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు, స్థానిక కమ్యూనిటీ అసోసియేషన్లతో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాము," అని ఏప్రిల్ 29న భారత రాయబార కార్యాలయానికి చెందిన ఎక్స్​లో ఒక పోస్ట్​ చేశారు.

ఒట్టావా ఇండో-కెనడియన్స్ అసోసియేషన్ (ఓఐసిఎ) పెట...