భారతదేశం, ఫిబ్రవరి 2 -- బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె గతేడాది సెప్టెంబర్ 8న తమ జీవితంలోకి చిన్నారి 'దువా'ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దీపికా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా 'హార్పర్స్ బజార్ ఇండియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా తన కూతురు దువా గురించి చేసిన దీపికా పదుకొణె వ్యాఖ్యలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

ప్రస్తుతం మీకు దేనిపై ఎక్కువగా మక్కువ (Obsession) ఉందని అడగ్గా.. "ప్రస్తుతం అని కాదు, నా జీవితకాలం నా కూతురే నాకు అతిపెద్ద మక్కువ" అని దీపికా బదులిచ్చింది. తల్లయ్యాక తనలో వచ్చిన మార్పులను వివరిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

మీ బ్యాగులో ఉండే వింత వస్తువు ఏదని అడగ్గా.. "దువా తింటూ నా బ్యాగులో పడేసిన ఒక 'థెప్లా' (గుజరాతీ వంటకం) ముక్క" అని నవ్వుతూ సమాధానమిచ్చింది దీపికా పదుకొణె. అం...