Hyderabad, జూన్ 20 -- భారీ అంచనాల మధ్య రిలీజైన కుబేర మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ తొలి రోజే రూ.19 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో శని, ఆదివారాల్లో మరిన్ని భారీ వసూళ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన మూవీ కుబేర. తెలుగుతోపాటు ఇతర సౌత్ భాషలు, హిందీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఊహించినట్లే తొలి రోజే భారీ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ అనలిస్టుల ముందస్తు అంచనాల మేరకు రూ.19 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

సినిమాలోని లీడ్ రోల్స్ నటన అద్భుతమంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్...