Hyderabad, జూలై 7 -- కీర్తి సురేష్, సుహాస్ నటించిన మూవీ ఉప్పు కప్పురంబు నేరుగా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలుసు కదా. జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు జూన్ 30 నుంచి జులై 6 వరకు ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో ఈ మూవీ కూడా చోటు దక్కించుకుంది.

ఓటీటీల్లో ప్రతి వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జూన్ 30 నుంచి జులై 6తో ముగిసిన గత వారానికి సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది.

ఇందులో తెలుగు మూవీ, నేరుగా ప్రైమ్ వీడియోలోకే వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా గత వారం 2 మిలియన్ల వ్యూస్ సాధించింది. అది కూడా కేవలం ఇండియాలోనే, కనీసం 30 నిమిషాల పాటు చూసిన వ్యూస్ నే పరిగణనలోకి తీసుకుంటారు.

ఇక టాప్ 5 సినిమాల జాబితాలో ఎ...