భారతదేశం, సెప్టెంబర్ 13 -- పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కార్ల తయారీ సంస్థ కియా ఇండియా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జీఎస్టీ కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే, తమ కార్లపై ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కియా కార్లపై గరిష్ఠంగా రూ. 2.25 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు! ఈ పరిమిత కాల ఆఫర్ సెప్టెంబర్ 22, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది! ఆ తర్వాత కొత్త జీఎస్టీ నిబంధనలు ఆ రోజు నుంచి అమలులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులు సెల్టోస్, కొత్తగా విడుదలైన క్యారెన్స్ క్లావిస్, క్యారెన్స్ ఎంపీవీ మోడళ్లపై ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ పథకం కింద.. కియా సెల్టోస్‌పై కేరళలో అత్యధికంగా రూ. 2.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అదే విధంగా క్యారెన్స్ క్లావిస్ మోడల్‌పై తమిళనాడులో గరిష్ఠంగా రూ. 1.55 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాంతాన్ని...