భారతదేశం, జూలై 20 -- కియా తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా క్యారెన్స్ క్లావిస్ ఈవీని భారత మార్కెట్‌లో కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. అంతేకాకుండా, ఇది కియా ఇండియాకు మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ కోసం కియా ఇండియా జులై 22 నుంచి అధికారిక బుకింగ్‌లను స్వీకరించనుంది. రూ. 17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదలైన కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ, మూడు ప్రధాన వేరియంట్‌లు, రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మీరు కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, బ్యాటరీ వేరియంట్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఈ వివరాలు మీకు సహాయపడతాయి.

కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ మూడు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి హెచ్‌టికె ప్లస్, హెచ్‌టిఎక్స్, హెచ్‌టిఎక్స్ ప్లస్. అంతేకాక...