భారతదేశం, మే 3 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‍డమ్ సినిమాపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. విజయ్‍కు వరుసగా కొన్ని ప్లాఫ్‍లు వచ్చినా ఈ మూవీపై మాత్రం అంచనాలుగా భారీగా ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కింగ్‍డమ్ మే 30వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కింగ్‍డమ్ గురించి అనిరుధ్ మాట్లాడారు.

తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్పాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్‍కు ప్రశ్న ఎదురైంది. కింగ్‍డమ్‍తో పాటు రజినీకాంత్ 'కూలీ' సినిమాల గురించి అనిరుధ్ చెప్పారు. కింగ్‍డమ్ సినిమా చివరి 40 నిమిషాలు చూశానని, చాలా బాగుందని చెప్పారు.

కింగ్‍డమ్, కూలీ సినిమాలకు తన ఫైర్ ఎమోజీల కోసం వెయిచ్ చేయవద్దని, రెండూ బాగున్నాయని అన్నారు. "ముందు విజయ...