Hyderabad, జూలై 23 -- విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కులపై తాజాగా వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ఓటీటీ హక్కులకు రికార్డు ధర పలికింది.

కింగ్డమ్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా రూ.53 కోట్లు వెచ్చించినట్లు ఓటీటీప్లే రిపోర్ట్ వెల్లడించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతేకాదు అతని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే. మేకర్స్ ఈ యాక్షన్ డ్రామా కోసం సుమారు రూ.130 కోట్లు ఖర్చు చేశారు.

విజయ్ కు చాలాకాలంగా ఓ మంచి హిట్ లేకపోయినా.. కింగ్డమ్ ను భారీ బడ్జెట్ తో నిర్మించడం, నెట్‌ఫ్లిక్స్ భార...