భారతదేశం, ఫిబ్రవరి 5 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో.. భర్తగా ఎలాగో బాధ్యతగా ఉండరు కానీ తండ్రిగానైనా ఉండాలి కదా. ముఖం మీదే స్వప్న చీ కొట్టడంతో కాశీ వెళ్లిపోయాడు. వాడిని తీసుకొచ్చింది నేనే కాబట్టి నన్ను అవమానించడంతో వచ్చేశానని శ్రీధర్ తో కాంచన అంటుంది.

నా పిల్లలకు తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం ఒకేలా వచ్చాయని శ్రీధర్ అంటాడు. స్వప్నను కార్తీక్ తో పోల్చకండి. అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి. నా కొడుక్కి మూర్ఖత్వం లేదు. భార్యాభర్తలకు ఉండాల్సిన గౌరవం, నమ్మకం నా కొడుకు, కోడలి మధ్య ఉన్నాయి. నీ కూతురు, అల్లుడికే లేవు. స్వప్న ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో విన్నారు కదా. తండ్రిగా బాధ్యతతో కూతురిని దారిలో పెట్టాలని శ్రీధర్ పై ఫైర్ అవుతుంది కాంచన.

స్వప్న పుట్టింట్లోనే ఉండిపోతే ఏం చేస్తారని కాంచన అడిగితే మరో పెళ్లి చేస్తానన...